డ్యూయెల్ రోల్ లో  కళ్యాణ్ రామ్

30 Mar,2019

వరుస పరాజయాల తరువాత ఇటీవల 118 తో హిట్ కొట్టాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇక ఈ చిత్రం తరువాత కళ్యాణ్ రామ్ తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. నూతన దర్శకుడు వేణు మల్లిడి ఈ సినిమా ను డైరెక్ట్ చేయనున్నాడు. సోషియో ఫాంటసి గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘తుగ్లక్’ అనే టైటిల్ ఖరారు చేశారని సమాచారం.  ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. కళ్యాణ్ రామ్ డ్యూయెల్ రోల్ లో నటించడం ఇది మొదటసారి కాదు. ఇంతకుముందు ఆయన ‘హరేరామ్’ సినిమాలో రెండు పాత్రల్లో నటించాడు. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్ టి ఆర్ ఆర్ట్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , క్యాథెరిన్ హీరోయిన్లు గా నటించనున్నారట.

Recent News